
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మండలంలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. సబ్ రిజిస్టార్ మండల మెజిస్ట్రేట్ అయిన తాసిల్దార్ కార్యాలయంలో తాహసిల్దార్ సృజన్ కుమార్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ చంద్రకాంత్, మండల పశువైద్యశాలలో డాక్టర్ రాజశేఖర్, మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ గోంది దివాకర్, లు జెండా ఆవిష్కరించి భారత గణతంత్ర దినోత్సవం గురించి మాట్లాడారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాలల విద్యార్థిలు మండల 103వ జాతీయ రహదారి వెంట చేసిన కోలాటం నృత్యాలు జాతీయ పతాకాలు చేతబట్టి చేపట్టిన ర్యాలీ పలువురిని అమితంగా ఆకర్షించాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, డిప్యూటీ తాసిల్దార్ మమత, లు ఉత్తమ అవార్డులను కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు.