–
రేపటి దేశ భవిష్యత్తు తరగతి గదిలో దాగి ఉంది

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
రేపటి దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో దాగి ఉందని, సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు దత్తాద్రి గౌడ్ శుక్రవారం అన్నారు. జక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామంలో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రెడ్ కౌన్సిల్l జాతీయ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయకుమార్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ మామిడాల మనోహర్ , సౌత్ ఇండియా వర్కింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ గంప హనుమ గౌడ్ తెలంగాణ రాష్ట్ర డాక్టర్ సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు…. శుక్రవారం ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని జండా ఆవిష్కరణ చేయడం జరిగిందని, సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు దత్తాద్రి గౌడ్ తెలిపారు. ప్రాథమిక పాఠశాల పడకల్ గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మహోన్నతమైన వ్యక్తుల వేషధారణ చేసిన విద్యార్థినీ విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేశారు. అధ్యక్షుడు బట్టి దత్తాద్రిగౌడ్ మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవంలో భాగంగా భారత రాజ్యాంగం గురించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, హక్కులు, వాటి అంశాలపై ప్రస్తావించి, శ్రద్ధగా చదివి, క్రమశిక్షణతో వెలగాలని రేపటి దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో దాగి ఉందని ఉపాధ్యాయులు అందరూ చాలా మేధాసంపత్తిని కలిగి ఉన్నారని, పలు అంశాలను సేవలు కొనియాడుతూ తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలను పెద్దలందరికి విలువని ఇవ్వాలని క్రమశిక్షణకు మారుపేరుగా మెలగాలని దత్తాత్రి గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, రాజేందర్, నర్సయ్య, జక్రన్పల్లి మండలం వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ మరియు ప్రధానోపాధ్యాయులు టీచర్లు విద్యార్థిని విద్యార్థులు గ్రామ ప్రజలు మన సభ్యులు పాల్గొన్నారు.