76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సమీపంలో మున్సిపల్ పట్టణ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్ ఆదివారం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా విముక్తి పొందిన భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందడానికి 2సంవత్సరాల 11నెలల 18రోజులు అవిశ్రాంతంగా కృషిచేసిన మహనీయుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ని కొనియాడారు. మహనీయుల స్ఫూర్తి తో దేశసేవ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశప్రజలకు అన్నం పెట్టే రైతన్నలను, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికుల సేవలను కొనియాడుతూ జై జవాన్ జై కిసాన్ అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు కోమటి వీరేశం, జిల్లా నాయకులు బోడ ఆంజనేయులు, రావిరాల శ్రీను, అన్నెపర్తి యాదగిరి, సామ వెంకట్ రెడ్డి, ఏనుగు వెంకట్ రెడ్డి, సోమ శంకర్, యువ మోర్చా అధ్యక్షులు దోటి శివ, సీనియర్ నాయకులు బిజిలి యాదయ్య, దుస్స గణేష్, చిట్టిప్రోలు వెంకటేశం, తోకల రవీందర్, చెరిపల్లి కృష్ణ, అచ్చాలు గౌడ్, కటకం నరేష్, కారింగు విజయ్, వేముల పవన్, శంకర్ యాదవ్, లవకుమార్, మల్లిఖార్జున్, సోమ రాజు, గండూరి మల్లేష్, సంగెపు సాయి, బుషిపాక ప్రణీత్ పాలకూరి నరసింహ, నాగరాజు, తలారి సాయి, నరేష్, రాందేవ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.