మండల కేంద్రమైన తాడిచెర్లలోని తహశీల్దార్, మండల పరిషత్,పిఏసిఎస్ కార్యాలయాలు, కొయ్యుర్ పోలీస్ స్టేషన్, అటవీశాఖ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రము,బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ,అన్ని గ్రామ పంచాయతీల్లో, ప్రభుత్వ జూనియర్ కళాశాల,ప్రభుత్వ,ప్రయివేటు పాఠశాలలు,అంగన్ వాడి కేంద్రాలు, వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు,యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ,నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్,హమాలి సంఘం,కార్మిక సంఘం ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మూడు రంగుల మువ్వేన్నల జెండాను ఎగురవేసి ఘనంగా ఆదివారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,తహశీల్దార్ రవికుమార్,,ఎంపిడిఓ శ్యాంసుందర్,తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు,ఏఎమ్మార్ హెడ్ ప్రభాకర్ రెడ్డి,కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్,ప్రిన్స్ పాల్ విజయదేవి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు,మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపిటిసి సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు,జాతీయ మానవ హక్కుల సంఘం నాయకులు,సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక నాయకులు,వివిధ కుల సంఘాల నాయకులు,అధ్యాపకులు,ఉపాధ్యాయులు, యువత,విద్యార్థులు,ప్రజలు పాల్గొన్నారు.