ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..

76th Republic Day Celebrationsనవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట పట్టణం తోపాటు మండలంలోని 20 గ్రామ పంచాయతీలలో, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ రమేష్ బాబు జెండావిష్కరణ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మహమ్మద్ ఆయాజ్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో భీమేష్, మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ సెక్రటరీ ఆర్ మల్లేశం, పట్టణ పోలీస్ కార్యాలయంలో పట్టణ సీఐ వరగంటి రవి, రూరల్ కార్యాలయంలో రూరల్ సీఐ కిషోర్, ఎమ్మార్సీ భవనంలో ఎంఈఓ మంథని హేమలత, సింగిల్ విండో కార్యాలయంలో అధ్యక్షుడు సంపత్, స్థానిక గాంధీ చౌరస్తాలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు, ఏవో కార్యాలయంలో వ్యవసాయ అధికారి మహమ్మద్ ఖాదర్ హుస్సేన్, స్థానిక సివిల్ ఆస్పత్రిలో సూ పరింటెండ్ కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి, ఏపీఎం కార్యాలయంలో ఏపిఎం శ్రీనివాస్, శాఖ గ్రంథాలయంలో గ్రంథ పాలకురాలు ఎంకే లక్ష్మి, ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ సీఐ మాధవి లత, 20 గ్రామ పంచాయతీలలో ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు జెండా ఆవిష్కరణ చేశారు.
విద్యాసంస్థలలో: కాకతీయ విద్యా సంస్థలలో విద్యాసంస్థల చైర్మన్ ఆవిరినేని సుధాకర్ రావు, విద్యోదయ విద్యాసంస్థలలో విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ ఏ బూసి ఆర్యన్ కౌశిక్, లోటస్ పాండ్ పాఠశాలలో కరస్పాండెంట్ పుల్లూరు సంపత్ రావు, న్యూ మిలీనియం పాఠశాలలో కరస్పాండెంట్ ము సి పట్ల తిరుపతిరెడ్డి, సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కరెస్పాండెంట్ వై సునీల్ కుమార్, కేరళ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కె ఎస్ బెన్ని, న్యూ జయ భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కరస్పాండెంట్ రఘుపతి రెడ్డి, వోక్స్ పాప్  పాఠశాలలో కరస్పాండెంట్ రమణారెడ్డి, గాయత్రి డిగ్రీ కళాశాలలో కరస్పాండెంట్ ముస్కే వీర రాజు, కాకతీయ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ జెర్రిపోతుల రవిబాబు జెండావిష్కరణ చేశారు.