
భారతదేశ కిర్తీ ప్రతిష్టలు మన యువత పైన ఆధారపడి ఉందని శాంభవి హైస్కూల్ ఫౌండర్ బొట్ల విజయలక్ష్మి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జాతీయ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం పలువురు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మధుసూదన్ రాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఎందరో మహానుభావుల త్యాగఫలంగా సంపాదించి మనకు ఇచ్చారని రాజ్యాంగం అమలులో భాగంగా మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. రాజ్యాంగ సంరక్షణ బాధ్యత మనపైన ఉందిని,మన దేశం ప్రపంచంలో అన్నింట్లో ముందుకు దూసుకు పోతున్న సందర్బంగా మనం కూడ పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లవలిసిన భాద్యత ప్రతి ఒక్కరిదని ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిన్నారులు స్వాతంత్ర సమరయోోధుల వేేేేషధారణలో ఆకట్టుుకున్నారు. వేడుకల్లో భాగంగా వివిధ క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ఫౌండర్ బొట్ల విజయ లక్ష్మి ,చైర్మన్ బొట్ల మధుసూదన్ రాజు, కరెస్పాండంట్ రవీన్ ప్రసాద్, ప్రిన్సిపాల్ ఇంద్రాణి, వైస్ ప్రిన్సిపాల్ మంజుల, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.