టెట్‌కు 775 దరఖాస్తులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు రాష్ట్రవ్యాప్తంగా 775 మంది దరఖాస్తు చేశారు. ఈ మేరకు టెట్‌ కన్వీనర్‌ రమేష్‌, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, టెట్‌ చైర్మెన్‌ ఈవి నరసింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్‌ పేపర్‌-1కు 214, పేపర్‌-2కు 431, రెండింటికీ 130 కలిపి మొత్తం 775 మంది దరఖాస్తు చేశారని వివరించారు. టెట్‌ దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ఈనెల 20 వరకు ఉన్న విషయం తెలిసిందే. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి 20వ తేదీ వరకు రాతపరీక్షలను నిర్వహిస్తారు. ఇతర వివరాల కోసం ష్ట్ర్‌్‌జూర://రషష్ట్రశీశీశ్రీవసబ.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రనదించాల్సి ఉంటుంది. అయితే గతసారి కంటే టెట్‌ దరఖాస్తు ఫీజును ప్రభుత్వం తగ్గించింది. గతసారి ఒక పేపర్‌కు రూ.వెయ్యి, రెండు పేపర్లకు రూ.రెండు వేలు చెల్లించాలని నిర్ణయించింది. ఈసారి దాన్ని ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.వెయ్యి చెల్లించాలని కోరింది. ఇంకోవైపు ఈ ఏడాది మేలో టెట్‌ రాసిన అభ్యర్థులకు ఫీజు నుంచి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది.