ఘణంగా యస్టీయు 77వ ఆవిర్భావ దినోత్సవం

నవతెలంగాణ – సిద్దిపేట
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న సంఘం యస్టీయు అని జిల్లా అధ్యక్షులు పట్నం భూపాల్ అన్నారు. రాష్ట్రోపాధ్యయ సంఘం (యస్టీయు) 77వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యస్టీయు జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మట్టపల్లి రంగారావుతో కలసి ఆయన మాట్లాడుతూ గత 77 సంవత్సరాలుగా ఉపాధ్యాయ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసి, అనేక విజయాలు సాదించిందన్నారు. సిపియస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు పరచాలని, ఉన్నత పాఠశాలలో వెట్టిచాకిరి చేస్తున్న పండిట్ ,పిఈటి లను స్కూల్ అసిస్టెంట్ లుగా పదోన్నతులు కల్పించాలన్నారు. పాఠశాలలు పునః ప్రారంభమౌతున్న సందర్భంగా మౌళిక వసతులు కల్పించాలని, స్కావెంజర్ లను నియమించాలన్నారు. 317 జీవో ద్వారా స్థానికత కొల్పోయిన ఉపాధ్యాయులను తిరిగి స్వంత జిల్లాలలో నియమించలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు, కార్యవర్గ సభ్యులు మ్యాడ శ్రీధర్, వడ్లకొండ శ్రీనివాస్, ఉండ్రాళ్ళ రాజేశం, కొర్తివాడ రాజేందర్, తోట మధుసుదన్, లింగారెడ్డి, మంగళంపల్లి శ్రీనివాస్, బిక్షపతి, కలకుంట్ల రాములు, వీరబత్తిని యాదగిరి, రామంచ రవీందర్, మోర గణేష్, తదితరులు పాల్గొన్నారు.