ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

78th Independence Day Celebrationsనవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఉన్న నిజామాబాద్ జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ( ఎన్డీసీసీబీ ) ఆధ్వర్యంలో  గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ రాకేష్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం సాధించిన మహానుభావుల గురించి కొని ఆడారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ క్యాషియర్ శ్రావణ్ రెడ్డి, సిబ్బంది స్వామి తదితరులు పాల్గొన్నారు.