ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

78th Independence Day celebrations in grand styleనవతెలంగాణ – లోకేశ్వరం 
మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పాఠశాలలు,  ప్రభుత్వ కార్యాలయాలు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పార్టీ కార్యాలయాలతో పాటు పలు సంఘాల నాయకులు కూడా జాతీయ జెండాలను ఎగురవేశారు. ముందుగా భారతమాత , స్వాతంత్ర సమర యోధుల చిత్ర పటాలకు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. పలు పాఠశాలలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.