తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీన్ 7వ బెటాలియన్ లో కమాండెంట్ బి. రాంప్రకాష్ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కు అర్ట్ అఫ్ లివీంగ్ యోగా ట్రైనర్స్ బృందం పాల్గొని బెటాలియన్లో ఆధికారులు, సిబ్బందికి యోగా పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్బంగా కమాండెంట్ బి. రాంప్రకాష్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బందికి యోగా ప్రాముఖ్యత, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా ఎంతో దోహదపడుతుందని, మానసిక శారీరక ఆరోగ్య ప్రదాయిని అయినటువంటి యోగాను అనునిత్యం ప్రతి ఒక్కరు కూడా చేయాలని సూచించారు. యోగా వల్ల కలిగే లాభాలను వివరించారు. పోలీసు సిబ్బంది తమ విధులలో ఒత్తిడి జీవితాన్ని గడుపుతున్న తరుణంలో వారికి యోగా తరగతులు ఈ మానసిక సమతుల్యాన్ని అందించడంలో ఎంతో దోహదపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమం అసిస్టెంట్ కమాండెంట్ కె.పి.శరత్ కుమార్, అర్.ఐలు, అర్.యస్.ఐలు, తదితరులు పాల్గొన్నారు.