8 ఫీట్ల విగ్రహాలను ఉమ్మెడ గోదావరి బ్రిడ్జి వద్ద నిమజ్జనం చేయాలి

– జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్ వెల్లడి
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గణేష్ విగ్రహాలు 8 ఫీట్ల కన్న ఎక్కువ ఎత్తు గల విగ్రహాలు జాన్కంపేట్, నవిపేట్ వద్ద రైల్వే ఎలక్ట్రిక్ లైన్ ఉన్నందువలన రైల్వే వారు లేవల్ బీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సోమవారం ప్రకటనలో తెలియజేశారు. కావున 8 ఫీట్ల కన్న ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను బాసరకు వెళ్లెందుకు కష్టం అయినందున, బాసరకు కొద్ది దూరంలో ఉన్నటువంటి నందిపేట్ మండలం ఉమ్మెడ బ్రిడ్జి వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు చేయడం జరిగింది. 8 ఫీట్లకన్న ఎక్కువ ఎత్తు గల విగ్రహాలు కంఠేశ్వర్ బై పాస్ చౌరస్తా, మానిక్ బండార్, మాక్లూర్, ఆంద్రనగర్, నందిగుట్ట,  నందిపేట్ మండలం ఉమ్మెడ గ్రామ సమీపంలోగల గోదావరి బ్రిడ్జ్ కు చేరుకొని గణేష్ నిమజ్జనం చేయాలని తెలియజేశారు.