‘మాఊరి పొలిమేర’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన డా.అనిల్ విశ్వనాథ్ తాజాగా ‘మా ఊరి పొలిమేర-2’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘పొలిమేర’ చిత్రానికి సీక్వెల్ ఇది. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల నటించిన ఈ చిత్రానికి గౌరికష్ణ నిర్మాత. నవంబరు 3న ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ, ‘పొలిమేర’కి సీక్వెల్ చేయటానికి కారణం ఒకటే..
కథ రాసుకున్నప్పుడే సీక్వెల్ ఫిక్స్ అయ్యాం. కథలో ఉన్న సీరియస్ నెస్, ఇంకా చెప్పాలనుకున్న కథను పార్ట్ 2లో చెబుతున్నాం. ఎక్కడైతే పార్ట్ 1 ముగిసిందో.. పార్ట్ 2 అక్కడే మొదలవుతుంది. ఇది పక్కా సీక్వెల్. ‘కార్తికేయ’ చిత్రానికి దీనికి పోలిక ఉందా అని చాలా మంది అడుగుతున్నారు. గుడి అనే కామన్ పాయింట్ తప్ప ఆ చిత్రానికి మా చిత్రానికి ఎటువంటి సంబంధం లేదు. సినిమా చూస్తే మీకూ తెలుస్తుంది. ఈ చిత్రంలో ప్రేక్షకులు ఊహించలేని ఎనిమిది ట్విస్ట్‌లు ఉంటాయి. పార్ట్ 1కు మించి పది రెట్ల థ్రిల్ ను ఫీలవుతారు. పతాక సన్నివేశాలు షాకింగ్‌గా ఉంటాయి. ‘పొలిమేర 3′
కథ కూడా రెడీ ఉంది’ అని తెలిపారు.