– జిల్లా కలెక్టర్ దాసరి చందన
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్: రెండవ విడత శిక్షణ కార్యక్రమాలకు హాజరైన పిఓ, ఏపిఓ లకు ఈ నెల 8 ,9 తేదీలలో మూడో విడత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి చందన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం ఒకటి వరకు , మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, అందువల్ల పిఓ, ఏపీవోలు తప్పనిసరిగా ఈ శిక్షణ కార్యక్రమాలకు హాజరుకావాలని ఆమె తెలిపారు. శిక్షణ కార్యక్రమాలను ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించినట్టు తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమాలలో మరోసారి పోలింగ్ సక్రమ నిర్వహణ, మాక్ పోలింగ్ తదితర అన్ని విషయాలపై వివరంగా పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని అందువల్ల పివో, ఏపీవోలు ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.