డెవిల్‌ కోసం 80 భారీ సెట్స్‌

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డెవిల్‌”. బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ అనేది ట్యాగ్‌ లైన్‌. స్వాతంత్య్రానికి ముందు కథాంశంతో రూపొందుతున్న ఈ పీరియాడిక్‌ మూవీ కోసం 1940 బ్యాక్‌ డ్రాప్‌లో మేకర్స్‌ ఏకంగా 80 అద్భుతమైన భారీ సెట్స్‌ వేయటం విశేషం. ఈ సందర్భంగా ఆర్ట్‌ డైరెక్టర్‌ గాంధీ మాట్లాడుతూ,”బ్రిటీష్‌ పరిపాలనలో మన దేశం ఉన్న సయమానికి చెందిన సెట్స్‌ వేయటం ఛాలెంజింగ్‌గా అనిపించింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్‌ వంటి పలు ప్రాంతాల నుంచి సెట్స్‌కి కావాల్సిన సామాగ్రిని తెప్పించాం. నిర్మాత అభిషేక్‌ నామా సపోర్ట్‌ లేకుండా ఈ రేంజ్‌లో భారీ సెట్స్‌ వేసి సినిమాని రిచ్‌గా తెరకెక్కించటం సాధ్యమయ్యేది కాదు. 1940 మద్రాస్‌ ప్రాంతంలోని ఆంధ్రా క్లబ్‌, బ్రిటీష్‌ కాలానికి తగ్గట్లు 10 వింటేజ్‌ సైకిల్స్‌, 1 వింటేజ్‌ కారు, బ్రిటీష్‌ కవర్‌ డిజైన్‌తో ఉన్న 500 పుస్తకాలు, 1940 కాలానికి చెందిన కార్గో షిప్‌, 36 అడుగుల ఎత్తైన లైట్‌ హౌస్‌ సెట్‌ ఇలా దాదాపు 80 భారీ సెట్స్‌ను రూపొందిం చాం. వీటి కోసం 9 ట్రక్కుల కలపతో పాటు వెయ్యి టన్నులకు పైగా ఐరన్‌, ఫైబర్‌, 10వేల చదరపు అడుగుల వింటేజ్‌ వాల్‌ పేపర్‌ను ఉపయోగించాం’ అని తెలిపారు.