హైదరాబాద్ : సిటీ యూనియన్ బ్యాంక్ తన 800 శాఖను ఆయోధ్యలో ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఇది తమ సంస్థకు ఓ గొప్ప మైలురాయి అని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు సొసైటీలో తమ బ్యాంక్ 120వ ఏళ్లను పూర్తి చేసుకుంటుందని తెలిపింది. ఈ కొత్త శాఖ ప్రారంభోత్సవంలో సిటీ యూనియన్ బ్యాంక్ ఛైర్మన్ ఎం నారాయణన్, పారిశ్రామికవేత్త వినరు మనుచా, బ్యాంక్ మాజీ ఛైర్మన్ ఎన్ కమకోడి, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.