నవతెలంగాణ – కుబీర్ : పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు విస్త్రతంగా వాహనాలు తనిఖీలు చేస్తుండగా మహారాష్ట్ర లోని కిని గ్రామం నుంచి తెలంగాణా లోని కుబీర్ వైపుకు వస్తుండగా తనిఖీలు చేస్తున్న క్రమంలో కిని గ్రామానికి చెందిన నర్సింహా రెడ్డి వద్ద ఉన్న 81వేలు రూపాయలు ఎలాంటి పత్రాలు లేకుండా డబ్బులు కనిపించడం తో వారి వద్ద ఉన్న నగదు ను స్వదినం చేసుకోవడం జరిగింది.ఈ సందర్బంగా ఎస్ ఐ రవీందర్ మాట్లాడుతూ ఎమ్మెల్సి ఎన్నికలు నిర్వహిస్తూన సందర్బంగా ఎలాంటి పత్రాలు లేకుండా నగదు మరియు మద్యం సరఫరా చేస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు.