ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మూలయం సింగ్ యాదవ్ 85వ జయంతి వేడుకలను భువనగిరిలో ములాయం సింగ్ యాదవ్ యూత్ బ్రిగేడు రాష్ట్ర అధ్యక్షులు మేకల బాలు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి పల్లెటూరి గుండెకాయ అని చెప్పిన గొప్ప నాయకుడు మూలయ సింగ్ యాదవ్ అని ఆయన సేవలను కొనియాడారు. సమాజ్వాది పార్టీని దేశంలోనే మూడవ అతిపెద్ద పార్టీగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఎనలేనిదన్నారు. యువత ఆయన ఆశ సాధన కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు స్వరూప రాణి, శ్రీహరి, ముదిరాజ్, రవికుమార్ , జిల్లా నాయకులు పాల్గొన్నారు.