– బ్యాంక్‌లకు చేరాయన్న ఆర్బీఐ
ముంబయి : ప్రస్తుత ఏడాది జులై 31 నాటికి 88 శాతం మేర రూ.2,000 నోట్లు బ్యాంక్‌లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. వీటి మొత్తం విలువ రూ.3.14 లక్షల కోట్లుగా ఉంటుందని తెలిపింది. ఇంకా 42వేల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు చెలామణీలో ఉన్నాయని.. ఆ మొత్తం బ్యాంక్‌లకు చేరలేదని తెలిపింది. మే 19న ఆర్బీఐ రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నాటికి మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు మార్కెట్‌లో ఉన్నాయి. వీటి మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ గడువు ఇచ్చింది. ఇప్పటి వరకు వెనక్కి వచ్చిన మొత్తం నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలోనే వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. మిగితా 13 శాతం మాత్రమే వేరే నోట్లతో మార్పిడి చేసుకున్నారు. ఈ రెండు నెలల్లోనే మిగతా నోట్లను మార్చుకోవాలని ఆర్బీఐ ప్రజలకు సూచించింది.