8వ పే కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి..

– రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మజ్దూర్ యూనియన్ అలుపెరుగని పోరాటం..
– మజ్దూర్ యూనియన్ జోనల్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ శంకర్ రావు
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
హైదరాబాద్( నాంపల్లి ) జనరల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మాణం చేసిన బ్రాంచ్ కార్యాలయంను జోనల్ ప్రధాన కార్యదర్శి శంకర్ రావు జోనల్ అధ్యక్షులు శ్రీనివాస్ హాజరై ప్రారంభించారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రధాన కార్యదర్శి శంకర్ రావు మాట్లాడుతూ… రైల్వే హక్కుల కోసం మజ్దూర్ యూనియన్ రాజిలేని పోరాటం చేస్తుందని అన్నారు. 8 వ కమిషన్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేసారు. నూతన పెన్షన్ విధానం రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. రిస్ట్రాక్షరింగ్ కమిటీ త్వరగా పూర్తి చేయాలని రైల్వే ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కార్మికులపైన పని భారం తగ్గించాలని డిమాండ్ చేసారు  ఈ సందర్బంగా పలువురు మజ్దూర్ యూనియన్ లో చేరారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ జోనల్ కోశాధికారి సరోజినీ రెడ్డి, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఉదయ భాస్కర్, భారాటే, శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ జనరల్ బ్రాంచ్ కోశాధికారి ఏ శ్రీనివాస్, సికింద్రాబాద్ డివిజనల్ సెక్రటరీ రవీందర్,ప్రెసిడెంట్ ఖాజాబాబ, సిసియాస్ ప్రెసిడెంట్ స్వామి,  ఎడిఎస్ లు నాగలక్ష్మి చైర్మన్ గోపాల్, సెక్రటరీలు వర ప్రసాద్,ఢిల్లీ రావు, శ్రీనివాస్, సమయ్య, వేద ప్రకాష్, రాజేందర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.