9 కిలోల గంజాయి పట్టివేత

నవతెలంగాణ-మిర్యాలగూడ
నియోజకవర్గం లోని దామరచర్ల మండలంలోని తాళ్ళ వీరప్పగూడె గ్రామంలో సోమవారం మిర్యాల గూడ ఎక్సయిస్‌ పోలీసులు 5కేజీల గంజాయి స్వాధీనం చేసున్నారు. ఒరిస్సా కి చెందిన మనోరంజన్‌ సర్కార్‌ జార?ండ్‌ కి చెందిన మహ్మాన్‌ షకీల్‌ అన్నరి లు ముఠాగ ఏర్పడి దామరచర్ల పరిసరాల్లో గంజాయి విక్రయిస్తున్నారు. విశ్వాస నీయ సమాచారం మేరకు వాహన తనిఖీలు చేయగా బైక్‌ పై అక్రమంగా రవాణా చేయుచున్న 5కేజిల గంజాయి తరలిస్తు పట్టుబడినట్లు పేర్కొన్నారు. నిందితులతో పాటు బైక్‌ సెల్‌ ఫోన్‌ లు స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. అదేవిదంగా నల్లగొండలో మనోహర్‌ సర్కార్‌ యింటిని సోదా చేయగా 4కిలోల 250గ్రాముల ఎండు గంజాయి లభించిందన్నారు. మొత్తం 9కిలోల 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌ కి తరలించినట్లు సీఐ మహేశ్వర్‌ రెడ్డి తెలిపారు.