ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 90.4% శాతం ఉత్తీర్ణత

నవతెలంగాణ – మోర్తాడ్
మండలంలోని ఎనిమిది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం 235 మంది విద్యార్థులకు గాను 221 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాశాఖ అధికారి ఆంధ్రయ తెలిపారు. జెడ్ పి హెచ్ ఎస్ దొనకల్, జడ్.పి.హెచ్.ఎస్ శెట్పల్లి, జడ్.పి.హెచ్.ఎస్ సుంకేట్, గౌట్ హైస్కూల్ మోర్తాడ్ 100% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.  పాఠశాల చెందిన జే వర్షిత 9.8 సుంకేట్, శెట్టిపల్లి పాఠశాల చెందిన నందిత 9.8 సాధించినట్లు తెలిపారు. మండలంలోని రెండు ప్రైవేట్ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించగా నవోదయ పాఠశాల చెందిన ఆదిభ ఫిర్దోస్ 10 బై 10 మార్కులు సాధించినట్లు తెలిపారు.