యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.44% ఉత్తీర్ణత

– బాలికలదే పై చేయి
నవతెలంగాణ –  భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.44 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 4537 మంది హాజరు కాగా 4202 మంది. 92.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 4,571 మంది పరీక్షలకు హాజరుకాగా 432 మంది 88.21 ఉత్తీర్ణత సాధించారు. మొత్తము 9108 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 8237 మంది ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరంతో ఫలితాలను పోలిస్తే 9.5% ఈ సంవత్సరం అధికంగా ఉత్తీర్ణత సాధించారు.
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలదే ఆధిపత్యం
ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వానికి చెందిన  రెసిడెన్షియల్ పాఠశాలలు విద్యార్థులు 99.61% ఉత్తీర్ణత సాధించి మెరుగైన ఫలితాలు సాధించారు. ఆ పాఠశాలలో చదివిన 21 మందికి 10/10 మార్కులు వచ్చాయి. ఆశ్రమ పాఠశాలలో 68.42 శాతం అతి తక్కువగా మాత్రమే ఫలితాలు సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో 69.89, జిల్లా పరిషత్ 85.6, కేజీబీవీ 84.95, మోడల్ స్కూల్స్ 91.57, ఆర్ఈఎస్ 99.61 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ 98.9 ఆర్ఈఎస్ మినీ 99.1,బీసీ వెల్ఫేర్ 98.99, ఆశ్రమ పాఠశాలలు 68.42, ఏడేడ్ 100%, ప్రైవేట్ పాఠశాలలు 96.73% ఉత్తీర్ణత సాధించారు.  ప్రైవేట్ పాఠశాలలో చదివిన 31 మంది 10/ 10 మార్పు సాధించారు మొత్తము జిల్లాలో 68 మంది విద్యార్థులు 10/10 మార్కులు సాధించారు. అభినందనలు…జిల్లా విద్యాధికారి కే నారాయణరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల వారిని జిల్లా విద్యాధికారి కే నారాయణరెడ్డి అభినందనలు తెలిపారు గతము కంటే ఈ సంవత్సరం 9.5% ఉత్తీర్ణత పెరిగిందన్నారు 68 మంది విద్యార్థులు 10/10 మార్కులు సాధించడం అభినందనీమన్నారు. అభినందనలు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ,  లావుడ్య రాజు మంగళవారం అభినందనలు తెలిపారు.