90 నిమిషాల గ్రాఫిక్స్‌ అద్భుతం

90 minutes graphics are amazingజీవా, అర్జున్‌ ప్రధాన పాత్రధారులుగా అనేక బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సినిమాలను నిర్మించిన వేల్స్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ అధినేతలు డా.ఇషారి కె.గణేష్‌ ఇప్పుడు అనీష్‌ దేవ్‌ నేతృత్వంలోని డబ్ల్యుఏఎమ్‌ ఇండియాస్‌తో కలిసి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘అఘతియా’ మూవీని నిర్మిస్తున్నారు. రాశి ఖన్నాతో పాటు యూరోపియన్‌ నటి మటిల్డా, అమెరికన్‌ నటుడు ఎడ్వర్డ్‌ సోన్నెన్‌బ్లిక్‌ కీలక పాత్రలను పోషించారు. ఎంటర్‌టైన్మెంట్‌ ఎలిమెంట్స్‌తో ఉండే ఈ ఫాంటసీ థ్రిల్లర్‌ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. తాజాగా మేకర్స్‌ ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. దర్శకుడు పా.విజరు మాట్లాడుతూ, ‘అఘతియా హ్యూమన్‌ ఎమోషన్స్‌తో ఫాంటసీని బ్లెండ్‌ చేసిన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. ఇది మ్యాజిక్‌ గురించి మాత్రమే కాదు, పాత్రల మధ్య బాండింగ్‌ గురించి, తెలియని ప్రపంచం గుండా వారి జర్నీని ఆవిష్కరించే అద్భుత చిత్రీకరణ. దాదాపు 90 నిమిషాల పాటు అద్భుతమైన సీజీ విజువల్స్‌ అలరించబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూరుస్తున్నారు’ అని అన్నారు.