రామగిరిలో 91,800 మొక్కల పంపిణీ చేస్తాం

– ఎంపీడీఓ బి శైలజ రాణి 
నవతెలంగాణ-రామగిరి 
రామగిరి మండలంలో 17 గ్రామ పంచాయతీలలో వన మహెూత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని ఎంపీడీఓ బి. శైలజారాణి అన్నారు. సోమవారం రామగిరి మండలం రామయ్య పల్లె, పన్నూరు గ్రామాలలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి ఆరు మొక్కలు ఇచ్చే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రామగిరి మండలంలో 40,392 మొక్కలను నాటుతామని, 51,408 మొక్కలను ఇంటింటికీ పంచుతామని అన్నారు. మొత్తం 91800 మొక్కల పంపిణీకి, నాటడానికి ప్రణాళిక సిద్ధం అయిందన్నారు. ఆదివారం పేట గ్రామంలో 5400 మొక్కలు, బేగంపేటలో 10,800 మొక్కలు, బుధవారం పేటలో 6558, చందనాపూర్లో 4600, జల్లారంలో 3100, కలవచర్లలో 12,647, లధ్నాపూర్ లో 2,945, లొంకకేసారంతో 3600, ముస్త్యాలలో 4,200,నాగేపల్లిలో 310, నవాబుపేటలో 2400, పన్నూరులో 6,100, పెద్దంపేటలో 900, రాజాపూర్ లో 4200, రత్నాపూర్ లో 12,300, సుందిళ్లలో 6,500, వెంకట్రావు పల్లెలో 2,450 మొక్కలను నాటడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి ఇంచార్జీ ఎపీఓ రాసపల్లి లక్ష్మణ్, పంచాయతీ సెక్రెటరీ శ్రీధర్, సోలంకి సరిత పాల్గొన్నారు.