నవతెలంగాణ- మధిర
మధిర కోర్టులో ప్రధాన న్యాయమూర్తి టి.కార్తీక్ రెడ్డి అధ్యక్షతన మెగా లోక్ అదాలత్ శనివారం నిర్వహించారు. కేసుల వివరాలు ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఎక్సైజ్ కేసులతో సహా 174 కేసులు పరిష్కారం కాగా 1,06,370 రూపాయలు జరిమానా విధించారు. అదే విధంగా అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 76 కేసులు పరిష్కారం కాగా 1,02, 100 రూపాయలు జరిమానా విధించారు. ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి కోర్టులో 681 కేసులు పరిష్కారం కాగా 35,700 రూపాయలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా జరిగిన న్యాయ చైతన్య సదస్సులో ప్రధాన న్యాయమూర్తి టీ. కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ కక్షిదార్లు సంయమనం పాటించి సాధ్యమైనంత వరకు పట్టుదలకు పోకుండా కేసులు పరిష్కారానికి చొరవ చూపాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఎం.అబ్రహం, కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎన్.నాగలక్ష్మి, జె.భద్రయ్య బార్ అధ్యక్షులు బి.పుల్లారావు సీనియర్ న్యాయవాదులు వాసంశెట్టి కోటేశ్వరరావు, చింతల గోపాల్, ఎన్.జనార్దన్ రావు, పల్ల పోతుల కృష్ణారావు, టీ.వెంకట్రావు, కె.విజరు కుమార్, ఎం.సతీష్, జే.రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. లోక్ అదాలత్ దిగ్విజయానికి సహకరించినందుకు పోలీసు అధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఎస్.దివి, బి.హనీషా, ఉపేందర్ లను న్యాయమూర్తి అభినందించారు.