
నవతెలంగాణ – నెల్లికుదురు
షాహిద్ భగత్ సింగ్, రాజు గురు, సుకుదేవ్ ల 93వ వర్ధంతిని ఘనంగా నిర్వహించినట్లు పీవై ఎల్ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుగు అనిల్ తెలిపాడు. మండల కేంద్రంలో పీడీఎస్ యూ సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక కర్షకులకు అధికారం రావాలని పోరాడిన ఓకే ఒక వక్తి భగవత్ సింగ్ 23 ,1931న అమరుడైన భగత్ సింగ్ ఆశలకు విరుద్ధంగా 1947లో నల్లదొరలకు అధికారం వచ్చింది. దీంతో 77 ఏళ్లలో నల్ల దొరలు దేశ ప్రజలను దోచుకోవడం వల్ల వీరి సంపద గుట్టలు గుట్టలుగా పెరిగిపోయింది. ప్రజల పరిస్థితి దిగజారి పోయింది. భగత్ సింగ్ ఆశయాలు నెరవేరలేదు మతాలకతీతంగా నాడు యువత దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడితే నేడు బీజేపీ ప్రభుత్వం మత విదేశాల విదేశాలు రెచ్చగొట్టి రాజకీయ పా బం గడుపుతున్నారు, పి వై ఎల్, పిడిఎస్యు సంఘాలు షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుకుదేవులను, స్మరిస్తూ 93వ వర్ధంతి సభలను సమావేశాలను జరుపుతుంది. భగత్ సింగ్ ఆశయాలను దేశభక్తిని ప్రజల్లో ప్రచారం చేస్తుంది అని అన్నారు. భగత్ సింగ్ ఆశయాల కొరకు ప్రతి యువత విద్యార్థులు ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా కోరినట్లు తెలిపాడు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ, పి వై ఎల్ నాయకులు గణేష్, స్టాలిన్, రోహిత్, రాజు, బన్నీ, మహేష్, తదితరులు పాల్గొన్నారు.