లింగుపల్లి గ్రామంలో 95 శాతం పోలింగ్

– అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును సద్విని చేసుకోవడం గర్వకారణం
నవతెలంగాణ-మిరు దొడ్డి : శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం లింగుపల్లి గ్రామంలో 95% పోలింగ్ నిర్వహించారు.  మిరు దొడ్డి మండలం లింగుపల్లి గ్రామంలో అధికంగా పోలింగ్ రావడం ప్రజల మధ్య అవగాహనతో ఉన్నట్లుగా తెలుస్తుంది. అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరి వినియోగించుకోవడం పట్ల యువకులు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రెక్క అడుతే గానీ దుక్కాడని ప్రజలు కూలినాలు చేస్తూ జోన కొనసాగిస్తున్న వారు కూడా ఎంతోమంది ప్రజలు హైదరాబాద్ నుండి గ్రామానికి వచ్చి ఓటును సద్వినియోగం చేసుకోవడం పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డి బిఎఫ్ జాతీయ  కార్యదర్శి శంకర్, రాజు కిరణ్ నవీన్ మహేష్ బిక్షపతి అశోక్ యువకులు గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.