ముంబయి : ఇప్పటి వరకు 97 శాతం విలువ చేసే రూ. 2,000 నోట్లు బ్యాంక్‌లకు చేరా యని ఆర్‌బిఐ వెల్లడించింది. 2023 డిసెంబర్ 29వ తేదీ వరకు 97.38 శాతం తిరిగి బ్యాంకుల్లోకి వచ్చాయని తెలి పింది. పెద్ద నోటును ఉపసంహ రించుకుంటున్నట్లు 2023 మేలో ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి వరకు దాదాపు రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ.2వేల నోట్లు చెలామణిలో ఉన్నాయి. కాగా.. డిసెంబర్ 29వ తేదీ నాటికి రూ. 9,330 కోట్లు ఇంకా బ్యాంక్‌లకు రాకుండా మార్కెట్‌లో ఉండిపోయాయని ఆర్‌బిఐ వెల్లడించింది. ఇప్పటికీ పెద్ద నోట్లకు లీగల్ గుర్తింపు ఉందన్నారు. గతేడాది అక్టోబర్ 7వ తేదీ వరకు అన్ని బ్యాంకుల్లో రెండు వేల నోట్లను డిపాజిట్లను స్వీకరించారు. ఆ తర్వాత నుంచి ఆర్‌బిఐ రీజినల్ ఆఫీసుల్లో మాత్రమే ఈ నోట్లను తీసుకుంటున్న విషయం తెలిసిందే.