సాయుధ పోరాట యోధుడి 97వ జయంతి వేడుకలు

నవతెలంగాణ – రామారెడ్డి
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 97వ జయంతి వేడుకలను మండలంలో బుధవారం మండలంలోని గొల్లపల్లి మండల కురుమ సంఘం అధ్యక్షులు పాల మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… మారుమూల ప్రాంతంలో పేద కురుమ కుటుంబంలో జన్మించి, ఆనాడు జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు, పేద ప్రజలను హింసిస్తున్న భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు కే శివరాజు, ఆర్ వీరయ్య, రెడ్డి మల్లేష్, కే నరేష్, జే సుమన్, జే నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.