వైన్ షాపులో చోరీ 98 వేల రూపాయల అపహరణ 

నవతెలంగాణ-రామగిరి 
రామగిరి మండలంలోని ఆదివారం పేట, (లద్నాపూర్) లో గల మహాలక్ష్మి వైన్ షాప్ లో సోమవారం అర్ధరాత్రి షాపు సెటరు తాళాలు పగలగొట్టి వైన్ షాప్ లో చొరబడి 98 వేల రూపాయలు నగదు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు సోమవారం షాపు నిర్వాహకుడు దాడి రజినీకాంత్ రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాపు నిర్వాహకుడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు యువకులు అర్ధరాత్రి రెండున్నర ప్రాంతంలో షాపు షట్టర్ పగలగొట్టి లిక్కర్ సీసాలు తీసుకపోకుండా 98 వేల రూపాయలు నగదు మాత్రమే తీసుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు రామగిరి పోలీసులు ఎస్సై కటిక రవి ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.