నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సరస్వతీ నగర్ రోడ్ నెంబర్ 4 శబ్ద తరంగిణి సంస్థ కార్యాలయంలో దాశరథి కృష్ణమాచార్యుల జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్ సూపర్డెంట్ ఇంజనీర్ ఆర్ అండ్ బి ప్రకాష్ గౌడ్ హాజరై మాట్లాడుతూ..నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షులుగా రిటైర్డ్ ఆచార్యులు జి జి కళాశాల సెర్ల దయానంద్ హాజరై మాట్లాడుతూ.. నిజాంబాద్ లోని ఖిల్లా జైలు గోడల మీద ఎన్నో పద్యాలు వ్రాసినారని చావు ఎదుట ఉండగా బొగ్గుతో ఎంతో విషయాలు వ్రాసారని చైతన్య సారధి, పాటల వారధి ఆయనే దాశరథి అని తెలియజేశారు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడా బానల మెంత్ అనే కవితలు రాసిన మహాయోధుడు అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రిటైర్డ్ ఆర్ అండ్ బి సూపర్డెంట్ వినోద్ కుమార్, రాపల్లి శ్రీనివాస్ శ్రావణ్ కుమార్, సురేష్, ప్రవీణ్ కుమార్, రాజాబాబు, తదితరులు పాల్గొన్నారు.