– ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢకొీట్టిన కారు
– ముగ్గురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
నవతెలంగాణ – చిన్నకోడూరు
నిద్ర మత్తులో కారు డ్రైవర్ రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఎనిమిది మందికి గాయలవ్వగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామ శివారులో రాజీవ్ రహదారిపై ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణంలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాయడానికి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో పరీక్ష రాసేందుకు కారులో (టవేరా) వెళ్లి తిరిగి సిద్దిపేటకు బయలుదేరారు.
నిద్రమత్తులో ఉన్న కారు డ్రైవర్.. అతి వేగం, అజాగ్రత్తతో ఇసుక లోడుతో రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢ కొట్టాడు. ఏం జరిగిందో తేరుకునేలోపే.. కారు ముందు సీటులో కూర్చున్న వారు లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోవడంతో ప్రమాద స్థలంలోనే ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి సీరియస్ ఉన్నారు. కారులో మొత్తం 11మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్టు ప్రాథమిక సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నితిన్, గ్రీష్మ, నమ్రత ముగ్గురు ప్రమాద స్థలంలోనే మరణించారు.