విక్రాంత్, మెహరీన్ పిర్జాదా, రుక్సార్ థిల్లాన్ హీరో, హీరోయిన్స్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న మూవీ ‘స్పార్క్. ఇందులో హీరోగా నటించడంతో పాటు విక్రాంత్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. డైరెక్షన్ కూడా చేశారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ హై బడ్జెట్, టెక్నికల్ వాల్యూస్‌తో ప్రొడ్యూస్ చేసింది. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. బుధవారం ఈ సినిమాలోని మొదటి పాట ‘ఏమా అందం’ను విశాఖలోని ఓ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది.