క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి:ఎంపీపీ

Sports contribute to mental well-being: MPPనవతెలంగాణ-చిట్యాల
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి అన్నారు బుధవారం మండలంలోని చల్లగరిగ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో 67 వ ఎస్‌జీఎఫ్‌ మండల స్థాయి, కబడ్డీ, ఖోఖో వాలీబాల్‌ క్రీడలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా. ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల్లో దాగివున్న క్రీడా నైపుణాన్ని వెలికి తీయడానికీ ఇలాంటి ఆటలు మంచి వేదిక అని అన్నారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి కోడెపాక రఘుపతి మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడా కారులను జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో రామయ్య, గ్రామ సర్పంచ్‌ శ్రీమతి కర్ర) మంజుల అశోక్‌ రెడ్డి, ఎస్‌ఎంసీచైర్మన్‌ కె.. ప్రభాకర్‌ ఇంచార్జి హెచ్‌ఎం పి.సరిత, పీఈటీలు స్వరూపరాణి, లింగమూర్తి పీఈటీ, నైన్పాక, ఎం. సాంబరాజు పీఈటీ, జూకల్‌, సీహెచ్‌. భాస్కర్‌ రావు పీఈటీగోపాల్‌ పూర్‌ జె. సమ్మయ తదితరులు పాల్గొన్నారు.