నవతెలంగాణ- సిరిసిల్ల రూరల్
రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు ప్రధానంగా అంబేద్కర్ చౌరస్తాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సిరిసిల్లలోని రెండవ బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాలను వర్చువల్ గా నేడు ప్రారంభించనుండడంతో రాష్ట్ర మంత్రి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి సిరిసిల్లకు రానున్నారు. కానీ ఆయన చుట్టూ నిరసనల వలయం కనిపిస్తుంది. గత కొద్ది రోజుల నుంచి పర్మినెంట్ చేయాలని అంగన్వాడీ టీచర్లు ఆయాలు నిరవధిక సమ్మెను చేపట్టగా ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపకపోగా ఆ సమస్య అలాగే ఉండిపోయింది. రోజురోజుకు వారి ఉద్యమం ఉధృతం అవుతుంది గురువారం భారీ ర్యాలీ చేపట్టి వారి ఇబ్బందులను ప్రజలకు వివరించారు. అలాగే మధ్యాహ్న భోజనం నిర్వాహకులు కమిషన్ పెంచాలని వేతనాలు ఇవ్వాలని నిరసన జ్వాలలు చేస్తున్నారు. అంతేకాకుండా సమగ్ర శిక్షణ ఉద్యోగులు గత 18 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారికి వామపక్ష పార్టీల మద్దతు తోపాటు వివిధ రాజకీయ పార్టీల మద్దతు కనిపిస్తుంది దీక్షలు చేస్తుండడంతో అధికార పార్టీ మినహా మిగతా రాజకీయ పార్టీలన్నీ వారికి సంఘీభావం ప్రకటిస్తున్నాయి.
మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్లకు వచ్చేనా…
సిరిసిల్ల పట్టణంలో కార్యాలయం సమీపంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు దీక్షలు చేస్తున్నారు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల సమీపంలో దీక్షలు చేస్తున్నారు కలెక్టరేట్ సమీపంలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు నిరసనలు చేస్తున్నారు. ఇవన్నీ ఆందోళనలు ప్రభుత్వంపై నిరసనలు జరుగుతున్న సమయంలో సిరిసిల్లకు మంత్రి కేటీఆర్ వస్తాడా అనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఇంటలిజెన్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి మంత్రి పర్యటన ఖరార్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోతే మంత్రి పర్యటన ఉండకపోవచ్చు తప్పనిసరి మంత్రి రావాలనుకుంటే మాత్రం అంగన్వాడి చర్లు ఆయాల శిబిరం సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల దీక్ష మధ్యాహ్న భోజనం నిర్వాహకుల శిబిరాలను పోలీసులు రాత్రికి రాత్రే ఎత్తివేసి అవసరం అయితే వారిని ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకొని మంత్రి పర్యటనకు పోలీసులు సిద్ధం చేయవచ్చని ప్రజలు చర్చించుకుంటున్నారు ఇప్పటికే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి పోలీసు ఉన్నతాధికారులకు అందిస్తున్నారు.