నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ గ్రామ శివారులో సోయా పంటకు కాండపు ఈగ అధికం కావడం పత్తి పంటకు రసం పీల్చే పురుగుల బెడద అధికంగా ఉన్నట్లు ఆ క్లాస్టార్ పరిధిలోని ఏఈఓ సతీష్ గురువారం నాడు పంటలను పరిశీలిస్తూ గుర్తించారు సోయా పంటకు పత్తి పంటకు సోకిన పురుగుల బెడద నివారణ కోసం వ్యవసాయ రైతులకు సలహాలు సూచనలు అందజేశారు. పంటలకు పురుగుల బెడద అధికంగా కనిపించడంపై వ్యవసాయ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సలహాలు సూచనలు పాటిస్తే పంటలకు సోకిన పురుగులను నివారించుకోవచ్చని ఏఈఓ రైతులకు సూచించారు. ఈ పంటల పరిశీలన కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి కన్వీనర్ జక్కు గంగారం భూమన్న ఇతర రైతులు పాల్గొన్నారు.