గోవిందరాజుల స్వామి ఆలయంలో అన్నదానం

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రంలోని గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం అల్లం లేని బాబురావు అరుణ దంపతులు పూజ కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలయ్య పూజారి సాయి తేజ ఆధ్వర్యంలో బాబాకి అభిషేకం పూజా కార్యక్రమాలు తలపాగా రుద్రాక్ష మాల ధారణ కార్యక్రమాలను నిర్వహించారు. మధ్యాహ్నం సమయంలో బాబాకు హారతి ఇచ్చారు అనంతరం బాబురావు అరుణ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి వచ్చిన వారందరికీ భోజనం కల్పించారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన బాబురావు దంపతులను పలువురు అభినందించారు.