
– ఆదివాసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి
నవతెలంగాణ -తాడ్వాయి
వెంకటాపురం మండలం బండ్లగూడ సర్పంచ్ నరసింహమూర్తి ఐటీడీఏ డిడి పోచమ్మ ప్రశ్నించినందుకు, అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్న డిడి పోచం ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఐటీడీఏ ఏటూరు నాగారం పరిధిలోగల గిరిజన విద్య పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోకుండా గిరిజన విద్య పట్ల పూర్తి అలసత్వం వహిస్తూ విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్న డిడి పోచం ను ప్రశ్నించిన సర్పంచ్ కోరస నరసింహమూర్తి పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి భయభ్రాంతులకు గురి చేయడం విచారకరంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. డిడి పోచం గిరిజన సంక్షేమ శాఖలో ఒక ఉన్నత పోస్టులో ఉండి గిరిజన సమస్యలు పరిష్కరించాల్సింది పోయి తిరిగి వారి మీదనే కేసులు పెట్టడం ఆయన పనితీరు ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారని తెలియజేశారు. గత సోమవారం రోజున అనగా 11వ తారీఖు నాడు గిరిజన దర్బార్ కు తన గ్రామపంచాయతీలో ఆయన బర్లగూడెం లోని చిరుతపల్లి పాఠశాలకు ఒక ఉపాధ్యాయుని నియమించాలని గత ఆరు నెలలుగా పిఓ గారికి వినతి పత్రాలు ఇస్తూ మొరపెట్టుకుంటే దానిమీద పరిష్కారం చూపాల్సింది పోయి, డిడి గారు పట్టించుకోకపోవడం లేదని నిలదీసిన వెంకటాపురం మండలంలోని బర్లగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ నరసింహమూర్తి (ఆదివాసి నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు) గారిపై ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్లో డిడి గారు ఫిర్యాదు చేసి వేధింపులకు పాల్పడుతున్నాడని ఇలాంటి అధికారి ప్రజలకు ఏం న్యాయం చేస్తారని వాపోయారు. డిడి గతంలో కూడా ఇక్కడ పని చేసి సస్పెండ్ అయ్యారు తిరిగి మళ్ళీ ఇదే ఐటీడీఏ ఏటూరు నాగారంకు వచ్చిన ఆయన పద్ధతిలో ఎలాంటి మార్పు రాలేదని ఆయన అన్నారు. ఇతని వల్ల గిరిజన విద్య కుంటుపడుతుందని, చిరుతపల్లి విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు ఆందోళన వెలిబుచ్చారని ఆయన తెలిపారు. తక్షణమే కలెక్టర్ గారి స్పందించి ఆదివాసి సర్పంచ్ కోర్స నరసింహమూర్తి ని పోలీసుల చేత వేధిస్తున్న డిడి గారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలి తీసుకుని ఎడల 3000 మంది విద్యార్థుల తల్లిదండ్రులతో, ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ఐటీడీఏ ఏటూరు నాగారం ఆఫీస్ ను ముట్టడించి హక్కులను సాధించుకుంటామని తెలిపారు.