– జలమండలి మేనేజర్ రాజనరేందర్ నాయక్
నవతెలంగాణ-గండిపేట్
కాలనీలకు మంచినీటి వసతిని కల్పిస్తామని జలమండలి కిస్మత్పూర్ సెక్టార్ మేనేజర్ రాజా నరేందర్ నాయక్ అన్నారు. గురువారం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని గంధంగూడ మొదటి వార్డు బృందావన్, వెంకటేష్‌నగర్ కాలనీ జలమండలి అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బృందావన్ కాలనీలో కొత్తగా పైపులైన్‌తో పాటు జంక్షన్ ఏర్పాటు చేశామన్నారు. పేదలు నివసిస్తున్న కాలనీలకు త్వరలో మంజీరా నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. బృందావన్ కాలనీకి మరో రెండు రోజుల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు మంచినీళ్లు వసతిని కల్పించేందుకు కషి చేస్తామన్నారు. కాలనీవాసులు కార్పొరేటర్ తో కలిసి తమకు సమస్యను విన్నవించినట్లు చెప్పారు. త్వరలో పేదలు నివసిస్తున్న కాలనీలకు మంచినీటి వసతిని కల్పించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్, సేవకులు ప్రేమ్ కుమార్, కాలనీవాసులు ప్రభాకర్ శ్రీకాంత్ చారి, అంజయ్య, రమేష్ ,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.