– జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి చిప్పలపల్లి గ్రామంలో గొర్రెల పంపిణీ
నవతెలంగాణ-కందుకూరు
గొల్ల,కుర్మల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. కందుకూరు మండల చిప్పలపల్లి గ్రామ గొల్ల, కుర్మలకు ఎంపీపీ మంద జ్యోతి పాండు, మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డిలతో కలిసి గురువారం చిప్పలపల్లి గ్రామంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిపల్లపల్లి గ్రామంలో 27యూనిట్లు మంజూర య్యాయనీ,21 యూనిట్ల లబ్దిదారులకు గొర్లు అందజేసినట్టు తెలిపారు. ఒక్క యూనిట్‌కు రూ. 43 వేలు చెల్లెస్తే ప్రభుత్వం రూ. లక్షా 75వేలతో గొర్లను అందజేస్తున్నట్టు తెలిపారు. గతంలో సమైక్య రాష్ట్రంలో గొల్ల,కుర్మలను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ గొల్ల,కుర్మలకు గొర్లను అందించి, వారి అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారని తెలిపారు. ఈ కార్య క్రమంలో ఇన్చార్జి సర్పంచ్ బాలకృష్ణ, ఎంపీటీసీ సూరామోని లలిత కుమార్, మాజీ ఎంపీపీ మహేష్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొట్టి ఆనంద్, పశు వైద్యాధికారి రేవతి, గ్రామపంచాయతీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.