నవతెలంగాణ-వాజేడు
పేద ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి అన్నారు. వాజేడు గ్రామంలో సర్వే నెంబర్ 11లో నిరు పేదలు చేపట్టిన గుడిసెల పోరాటం గురువారం నాలుగో రోజు కొనసాగింది. పోరాట శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. పేదలకు ఇంటి జాగా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం గృహ లక్ష్మి ద్వారా రూ.5లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఇచ్చి ఇంటినిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను విస్మరించాయని అన్నారు. దీంతో ప్రజల పక్షాన సీపీఐ(ఎం) పోరాడు తుందని అన్నారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు పేదల పక్షాన ఎర్ర జెండా అండగా ఉంటుందని అన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పేదలు ఇంటి జాగా కోసం చేస్తున్న పోరాటంను స్థానిక తాసిల్ధార్, ఇతర అధికారులు గుర్తించి ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గ్యానం వాసు, ఎండీ దావుద్, మండల కార్యదర్శి కొప్పుల రఘుపతిరావు, నాయకులు గుగ్గిళ్ళ దేవయ్య, జెజ్జరీ దామోదర్, బచ్చల కష్ణబాబు, గొంది రాజేష్, పూనెం కష్ణబాబు, సౌమ్య,బత్తుల సంతోష్, తోలేం ముత్తయ్య, దుబ్బ లలిత, పాయం కుమారి, ఎట్టి విద్యాసాగర్, చిరంజీవి తదితరలు పాల్గొన్నారు.