– పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తత, తోపులాటలు కార్యాలయం లోపలికి వెళ్లకుండా అడ్డగింత
నవతెలంగాణ-సదాశివపేట
సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు గత కొన్ని రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడంతో.. గురువారం సీడీపీఓ కార్యాలయ ముట్టడి చేపట్టారు. పెద్ద ఎత్తున కార్యాలయ ప్రాంగణం వద్దకు చేరు కుని లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకు న్నారు. దీంతో ఆయా కార్యాలయాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. కాగా పలు చోట్ల నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట కూడా జరిగింది. కాగా ప్రభుత్వం తన మొండి వైఖరి వీడి.. సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను విరమించబోయేది లేదని వారు స్పష్టం చేశారు. సీడీపీఓ కార్యాలయ ముట్టడిలో సీపీఐ(ఎం) నాయ కులు గొల్లపల్లి జయరాజు, సీఐటీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశంలు వేర్వేరుగా పాల్గొని మాట్లాడా రు. రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారని.. గత 45 ఏండ్లుగా వాళ్లు విధులు నిర్వహి స్తున్నా కనీసం వేతనాలు లేవన్నారు. వారికి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యా లు ఏవి రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కల్పించడం లేదని మండిప డ్డారు. తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తదితర రాష్ట్రంలో హెల్త్ కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పండగ బోనస్, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ వంటి సౌకర్యాలు అమలు చేస్తున ా్నరని.. ఇక్కడ మాత్రం కనీస వేతనానికే గతి లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. వారికి కనీసం వేతనం రూ.26వేలు ఇవ్వాలన్నారు. ఐసీడీఎస్‌కు బడ్జెట్ పెంచి బలోపేతం చేయాలని, పక్కా భవనాలు మౌలిక వసతులు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు, హెల్పర్లకు ఐదు లక్షలు, వేతనంలో సగం పెన్షన్ నిర్ణయిం చాలని, ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని యెడల జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమ ంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్, సీఐటీయూ నాయకులు యాదగిరి, బాబురావు, అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షులు శశికళ, ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు ఏసు మని నాగరాణి లక్ష్మి ఇందిరా మ్రరాంబ, విజయలక్ష్మి అరుణ, లక్ష్మి, తదితర టీచర్స్ ఆయాలు పాల్గొన్నారు.
నారాయణఖేడ్‌రూరల్ : అంగన్వాడి టీచర్లను, ఆయాలను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా మాజీ అధ్యక్షులు ఎ.మాణిక్యం డిమాండ్ చేశారు. ఖేడ్‌లోని సీడీపీఓ కార్యాలయ ముట్టడిలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిత్య సరుకులు ధరలు, ఇంటి అద్దెలు, గ్యాస్ ధరలు, కూరగాయల ధరలు పెరిగాయని ఇప్పుడు ఇచ్చే జీతం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని పర్మనెంట్ చేయాలని, ఈఎస్‌ఐ,పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడ తామని హెచ్చరించారు. ఈ అంగన్వాడీల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు వినోద్ పటేల్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ ముట్టడ ిలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి ఎస్ చిరంజీవి, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొఠారి నర్సింలు, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నాగేశ్వరి, వీణకుమారి, శాంతాబాయి స్వరూప, అనురాధ, సత్య నిర్మల, లక్ష్మి, పుణ్యవతి, శ్యామల, పద్మ, అని త,బాలమణి, యాదమ్మ, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ : తమ సమస్యలను పరిష్కరించేంతవరకు అధికారులను కార్యాలయంలోకి వెళ్ళనివ్వబోమని జహీరాబ ాద్‌లోని సీడీపీఓ ఎదుట అంగన్వాడీలు నిరసనకు దిగారు. తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసుల సహకా రంతో అధికారులు కార్యాలయాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ముట్టడిలో సీఐటీయూ జిల్లా ఉపాదయక్షుడు కే.రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని.. ఈ ప్రభుత్వం కూడా మనుగడ సాధించబోదన్నారు. గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా స్పందించకపోవడం పోయి.. సమ్మెను విచ్ఛినకరం చేయాల నుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు పని చేస్తున్నారని.. వారంతా బడుగు, బలహీనవర్గాలకు చెందినవారే అన్నారు. కొన్నేండు ్లగా వారు సేవలందిస్తున్నా.. కనీస వేతనం చెల్లించకపో వడం అన్యాయమన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి.. వారికి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ ఐ, ఉద్యోగ భద్రత తది తర చట్టబద్ధ సౌకర్యాలు కల్పించా లన్నారు. లేని పక్షంలో ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో సీఐటీయూ జిల్లా సహా య కార్యదర్శి ఎస్.మహి పాల్, అంగన్వాడి యూనియన్ నాయకులు శోభ, నాగమణి, అంజమ్మ, అమత, గోరమ్మ, షాహీదా, అనురాధ, సబితా, మల్లమ్మ పాల్గొన్నారు.
జోగిపేట : అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిచాలని గత నాలుగు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని, వారిని బెదిరించి సెంటర్లో తాళాలు పగలగొట్టడం సమంజసం కాదని సీఐటీయూ ఆందోల్ డివిజన్ కార్యదర్శి డి. విద్యాసాగర్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం జోగిపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం విద్యా సాగర్ మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభు త్వ అధికారులు అంగన్వాడి సెంటర్‌ల తాళాలు పగలగొట్టి బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం దారుణ మన్నారు. తక్షణమే ప్రభుత్వం సమస్య పరిష్కారం కోసం ఆలోచించాలని లేనిచో సమ్మెను ఉధతం చేస్తామని హెచ్చ రించారు. సెంటర్ తాళం పగలగొట్టిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు మంగమ్మ, ఇందిరా, శెకమ్మా, అరుణ, జయమ్మ, బాలమణి, ఈశ్వరమ్మ, సాయ మ్మ, స్వరూప, లలితమ్మ, స్వప్న, యశోద, హిమబిందు, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ మద్దతు..
అంగన్వాడీల సమ్మెకు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ మద్దతు తెలిపారు. ఈ సందర ్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్‌వాడీలను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, అలాగే పెన్షన్ ,ఈఎస్‌ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు హెల్పర్లకు ఐదు లక్షలు చెల్లించాలన్నారు. అదేవిధంగా వేత నంలో సగం పెన్షన్ ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షల ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాం డ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువ నేత సాగర్ షేట్కార్, సీఐటీయూ నాయకులు చిరంజీవి, సీపీఐ(ఎం) జి ల్లా కార్య దర్శి మాణిక్యం , నారాయణఖేడ్ మండల్ కాంగ్రె స్ పార్టీ అధ్యక్షులు తాహిర్ అలీ, నారాయణాఖేడ్ నియోజిక వర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాయిలు తదితరులు పాల్గొన్నారు.