పది నగరాల్లో జూనియర్‌

Jr. in ten cities– బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌
– మెంటార్లుగా స్టార్‌
– షట్లర్లు సాత్విక్‌, చిరాగ్‌
హైదరాబాద్‌ : జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ (జెబిసి) 2023 ఈ నెల 15 నుంచి ఆరంభం కానుంది. విజయవంతంగా ఏడో సీజన్‌కు సిద్ధమైన జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ఈ ఏడాది దేశవ్యాప్తంగా పది నగరాల్లో జరుగనుంది. ఈ మేరకు నిర్వాహకులు పిఎన్‌బి మెట్‌లైఫ్‌ ఎండీ, సీఈవో ఆశీష్‌ కుమార్‌ శ్రీవాత్సవ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన టోర్నీ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్‌సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టిలు జెబిసి మెంటార్లుగా వ్యవహరించనున్నారు. గువహటిలో సెప్టెంబర్‌ 15 నుంచి ఆరంభం కానున్న ఈ టోర్నీ.. నవంబర్‌ 10న ఢిల్లీలో ముగియనుంది. కోచి, ముంబయి, బెంగళూర్‌, రాంచీ, అహ్మదాబాద్‌, లక్నో, జలంధర్‌లో సైతం టోర్నీ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో అక్టోబర్‌ 19 నుంచి 23 వరకు జెబిసి పోటీలు నిర్వహించనున్నారు.