పాన్‌ వరల్డ్‌ సినిమా ది డిజర్వింగ్‌

Pan World Movie The Deservingఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే చిత్రం ‘ది డిజర్వింగ్‌’. ఈ చిత్రాన్ని తెలుగు హీరో వెంకట్‌ సాయి గుండ హాలీవుడ్‌లో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌లో వెంకట్‌ సాయి కేవలం హీరోగానే కాదు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ప్రధాన పాత్రధారుడిగా ఒక తెలుగు వాడు హాలీవుడ్‌లో నటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ ద్వారా ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందిన ఎస్‌ ఎస్‌ అరోరా ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించడం ఓ విశేషమైతే, ఎస్‌ఎక్స్‌ఎస్‌డబ్ల్యూ ఫిలిం ఫెస్టివల్‌తో సహ అనేక పాపులర్‌ ప్లాట్‌ ఫామ్స్‌ల నుండి ప్రశంసలు పొందిన కోషి కియోకావా దీనికి గ్రిప్పింగ్‌ కథనంతో పాటు సినిమాటోగ్రఫీ అందించడం మరో విశేషం. ‘ట్రాన్స్ఫార్మర్‌’ చిత్రాలకు మ్యూజిక్‌ అందించిన స్టీవ్‌ జబ్లోన్స్కీ దగ్గర పని చేసి ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న గా వెంగ్‌ చియో దీనికి అద్భుతమైన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ను సమకూర్చారు.