నేటి యువత స్వయం ఉపాధి తో ఎదగాలి: మాజీ ఎంపీపీ రౌతు నర్సింహ రావు

నవతెలంగాణ – చివ్వేంల
నేటి యువత స్వయం ఉపాధి తో ఎదగాలని  మాజీ ఎంపీపీ రౌతు నర్సింహ రావు అన్నారు. ఆదివారం   వట్టిఖమ్మం పహాడ్ గ్రామంలో (ఎస్ఆర్ హెయిర్ స్టయిల్ షాప్) ను ప్రారంభించి   మాట్లాడారు. నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధార పడకుండా స్వశక్తితో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహిచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్ కలకొండ కరుణ శ్యాంసన్, మండల కో అప్షన్ షేక్ దస్తగిరి , బి ఆర్ ఎస్  మండల పార్టీ ఉపాధ్యక్షులు రావిచెట్టు సత్యం, మాజీ ఎంపీటీసీ పబ్బు  సైదులు , ప్రగడ నర్సింహ రావు, ఉప సర్పంచ్ నాగుల మీరా, వార్డ్ మెంబర్లు యసాని వెంకన్న , గోగుల రమేష్,గోగుల రాజు, బి ఆర్ ఎస్  నాయకులు కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు..