పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మెళనం..

నవతెలంగాణ-బెజ్జంకి 

మండల పరిధిలోని వడ్లూర్ బేగంపేట ప్రభుత్వోన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన 2000-01 విద్యాసంవత్సరం విద్యార్థులు అదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మెళనం నిర్వహించుకున్నారు. విద్యార్థులకు తాము బోధించిన విద్య, క్రమశిక్షణతో ఉద్యోగ,ఇతర రంగాల్లో రాణించి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుని ఇతరులకు సహాయపడే స్థాయికి ఎదగడం గర్వనీయమని హిందీ ఉపాధ్యాయుడు మల్లయ్య ఆనందం వ్యక్తం చేశారు.అనంతరం ఏర్పాటుచేసిన సభలో తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతగా విద్యార్థులు శాలువ కప్పి ఆత్మీయ సన్మానం చేశారు.