నవతెలంగాణ- మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వానికి మున్నూరు కాపుల సత్తా ఏమిటో చూపిద్దామని ఈనెల 21న బిచ్కుంద మండల కేంద్రంలోని బండయ్యప్ప ఫంక్షన్ హాల్ లో నిర్వహించే మున్నూరు కాపు సింహ గర్జనకు కుటుంబ సమేతంగా తరలి వెళ్దాం మున్నూరు కాపుల సత్తా చాటుదాం అంటూ మున్నూరు కాపు సంఘం కుల పెద్దలు పిలుపునిచ్చారు బిచ్కుంద మండల కేంద్రంలో ఈనెల 21న నిర్వహించే మున్నూరు కాపు సింహ గర్జన విజయవంతం కావడానికి మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ అంతాపూర్ గ్రామాలను సోమవారం నాడు మున్నూరు కాపు సంఘం నాయకులు వెళ్లి ఆయా గ్రామాల్లో మున్నూరు కాపుల కులస్తులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు రాష్ట్రంలో మున్నూరు కాపులం 23% ఉన్నప్పటికీ బీసీ డీ మున్నూరు కాపులకు సరైన రిజర్వేషన్ అందడం లేదని ప్రత్యేకంగా మున్నూరు కాపులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని అదేవిధంగా మున్నూరు కాపులకు 5000 కోట్లతో ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు కులవృత్తుల కింద మున్నూరు కాపులకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందజేయాలని ఈ విధంగా ప్రత్యేకంగా ఎనిమిది డిమాండ్లతో ప్రభుత్వానికి పోరాడుతున్నామని మనమంతా ఐక్యమత్యంగా పోరాడితే డిమాండ్లు సాధించుకోవచ్చని మున్నూరు కాపు కులస్తులకు తెలియజేశారు మున్నూరు కాపు సింహ గర్జన విజయవంతం కావడానికి ప్రతి కుటుంబం కుటుంబ సమేతంగా తరలిరావాలని సంఘం పెద్దలు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్నూరు శంకర్రావు డాక్టర్ బండి వార్ విజయ్ పెద్ద తడుగూర్ గ్రామ పెద్దలు ఆత్మ కమిటీ చైర్మన్ కొండ గంగాధర్ మాజీ సర్పంచ్ కొండా హనుమాన్లు ఆ గ్రామానికి చెందిన రాజు భూమయ్య తదితరులతో పాటు పలువురు నాయకులు పాల్గొనగా అంతాపూర్ గ్రామంలో గంగాధర్ తో పాటు ఆ గ్రామంలోని యువకులు పెద్దలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.