– మిల్లెట్ ల ప్రాధాన్యత ను చెప్పేందుకు ఏర్పాటు
నవతెలంగాణ- సిరిసిల్ల రూరల్
ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం గా ప్రకటించిన నేపథ్యంలో మిల్లెట్ ల ప్రాముఖ్యత , ఆరోగ్య పరిరక్షణలో వాటి ప్రాధాన్యతను గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి సిరిసిల్ల పట్టణంలోని హిమాన్షి చిల్డ్రన్స్ హాస్పిటల్ లో ఆసుపత్రి నిర్వాహకులు మిల్లెట్ ( చిరు , తృణ ధాన్యాలు) లతో చేసిన గణేశుడిని ప్రతిష్టించారు.5 అడుగుల పరిమాణం గల పర్యావరణ అనుకూల చిరుధాన్యగణపతి (మిల్లెట్) గణేశుడి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తిలకిస్తున్నారు. నిమజ్జనం పూర్తి అయ్యేంత వరకూ మిల్లెట్తో చేసిన వివిధ వంటకాలు 9 రోజుల పాటు రోజువారీ భక్తులకు ప్రసాదంగా అందించనున్నారు.