నవతెలంగాణ-చేర్యాల
చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించక పోతే అధికార పార్టీకి తగిన బుద్ధి చెబుతామని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బుట్టి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు పుట్ట రాజు అన్నారు. చేర్యాల రెవిన్యూ డివిజన్ సాధన కోసం చేర్యాల మండల కేంద్రంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం 9వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో చేర్యాల పట్టణ మాల మహానాడు నాయకులు కూర్చున్నారు. వారికి జేఏసీ కో చైర్మన్ ఆగంరెడ్డి పూల మాల, కండువాలు వేసి దీక్షలను ప్రారంభించారు. అంతకు ముందుకు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేర్యాల ప్రాంత అస్తిత్వం కోసం జరుగుతున్న పోరాటాన్ని అధికార పార్టీ నాయకులు నిర్లక్ష్యం చేస్తూ అధిష్టానం దష్టికి తీసుకెళ్లకపోవడం ఈ ప్రాంతానికి ద్రోహం చేయడమేనన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్లి చేర్యాలను రెవెన్యూ డివిజన్ ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అధికార బీఆర్‌ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. గుస్క రాందాస్, ఏఎంసీ డైరెక్టర్ బుట్టి ఆగమల్లు,రిటైర్డ్ తహసీల్దార్ శ్రీరాం మల్లయ్య, ఎనమల్ల సుదర్శన్, బుట్టి బాగయ్య, కమలాపురం కిష్టయ్య, మేడిపల్లి నర్సింహా, తాండ్ర ఆంజనేయులు, చంద శ్రీకాంత్, మహిళా అధ్యక్షురాలు గుస్క వసంతి, కాటం రవీందర్, పుట్ట ఐలయ్య,సుద్దాల కనకయ్య, పాకనాటి భాస్కర్, బుట్టి చందు, కాటం భాస్కర్, బడుగు శ్రీనివాస్, సుద్దాల కల్యాణి, కాటం భూషన,కాటం రాజవ్వ, కాటం సులోచన, ఎనమల్ల యాదమ్మ,సావిత్రి, గుస్క ఉమ దీక్షలో పాల్గొనగా మాజీ జెడ్పిటిసి కొమ్ము నర్సింగరావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు తడక లింగం, కొమురవెల్లి దేవస్థాన డైరెక్టర్ కందుకూరి సిద్ధి లింగం,టీడీపీ పట్టణ అధ్యక్షుడు మిట్టపల్లి నారాయణ రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.